Gospel Songs Ministry

8, నవంబర్ 2023, బుధవారం

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు (Male)

 

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు  ఇలలోన 
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 || 

ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు 
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 || 

ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము 
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము  || 2 ||  || శ్రీయేసు || 

పాపాలకు, మన లోపలకు  - ఇఁక చెల్లి పోయింది  కాలము
మనలోన చీకటి, తొలగించగా -  నేడు తెచ్చాడు మనకై తన తేజము  || 2 ||
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 ||  || ఓ అయ్యా || 

మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన  సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము || 2 || 
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 ||  || ఓ అయ్యా ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి