శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 ||
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 ||
ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 ||
ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము || 2 || || శ్రీయేసు ||
పాపాలకు, మన లోపలకు - ఇఁక చెల్లి పోయింది కాలము
మనలోన చీకటి, తొలగించగా - నేడు తెచ్చాడు మనకై తన తేజము || 2 ||
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 || || ఓ అయ్యా ||
మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము || 2 ||
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 || || ఓ అయ్యా ||
Your song is very nice and your voice is also nice akka
రిప్లయితొలగించండి