Gospel Songs Ministry

15, ఫిబ్రవరి 2025, శనివారం

పెళ్లి కుమారుడు!

 

అందమయిన మనసు గల భార్యకు భర్త ఎప్పుడు రాజే, అతనికి భార్య ఎప్పుడు రాణియే. అటువంటి కుటుంబానికి యజమాని క్రీస్తు, అయనే రాజులకు రాజు. Ephesians 5:22-33 ఎప్పుడన్నా చదివారా? లోకనుసారముగా, ప్రేమ, సహజీవనం అని పెళ్ళికి ముందే తొందరపడే యువకులకు, యోసేపు లాగా పాపమును ద్వేషించాలని, పరిశుద్ధాత్మ ద్వారా సహనంతో ఉండాలని చెప్పటం వాక్య విరుద్దామా? కేవలం అందచందాలు చూసి, విశ్వాసురాలు కాకపోయినా ప్రేమించామని, అమ్మాయిని మోహించి, పెళ్ళి చేసుకోని, విశ్వాస జీవితం పాడు చేసుకొన్నా ఎంతో మంది అబ్బాయిలు ఉన్నారు. వారికి ఎస్తేరు, దెబోరా, రిబ్కా లాంటి దేవుని బిడ్డలు, కేవలము క్రీస్తు మీద విశ్వాసము ఉన్న వారు తోడుగా రావాలని, దేవుని చిత్తాని అడగాలని చెప్పటం, సొంత గొప్ప చెప్పుకోవటమా? సాటి అయినా సహకారి కోసం ఎదురు చూడటం, విరహ వేధన చాటటామా? లేక యవ్వనస్తులను మంచి సందేశం ద్వారా నడిపించటమా? మీ స్వనీతితో మీ కళ్ళు మూసుకొని పోయాయి. ట్రైన్ ఎక్కితే తప్పు లేదు, బైక్ ఎక్కితే తప్పు లేదు, కారు ఎక్కితే తప్పు లేదు, పడవ ఎక్కితే తప్పు లేదు! వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయి కాబట్టి, వాటితో పని చేస్తూ, తానూ పాడుకున్నట్లుగా చూపించాము. బైబిల్ పట్టుకొని పాడింది కనబడదు. గుర్రం ఎక్కవద్దని బైబిల్ లో రాసి ఉందా? అన్ని పాటలు చర్చి ఆరాధనలో పాడుకోరు. ఇది ఒక పెళ్ళి పాట, అర్థం చేసుకోండి. మీరు ఎన్ని కామెంట్స్ పెట్టిన, ఎవరికీ నష్టం లేదు, మీ సమయం వృధా. మూర్కులను ఎలాగూ మార్చలేము, కొంత మంది విజ్ఞులకయినా, ఈ పాట ఉద్దేశ్యం అర్థం కావాలని వివరణ ఇస్తున్నాను. సమస్త ఘనత మహిమ, నా రక్షకుడు, నా దేవుడు, సజీవుడు అయినా నా యేసయ్యకే. ఆమెన్!!

అందమయిన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని || 2 || వెడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని || 2 || || అందమయిన || యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము సాకులు వెతకని సహనము, పరిశుద్దాత్మతో పయనము || 2 || కన్నె వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము || 2 || || అందమయిన || ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి దెబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి || 2 || దేవుడు ఎవరిని జతగా చేసినా తెలిపెద సమ్మతము ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము || అందమయిన || కలిమి లెమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి || 2 || సాటి అయినా తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి || 2 || || అందమయిన ||