యేసు రాక తరుణ మాయే
నీవు సిద్దమా ! సోదర!
ఆ పవిత్రుని చేరుటకు
అర్హురాలివా? సోదరి! || 2 ||
తలుపు కొట్టి పిలిచినప్పుడు
పలుకుటకు నీకు సాధ్యమా!
తండ్రి రాజ్యం చేరుటకు
ఇదియే తరుణం ఓ సంఘమా || 2 ||
పగిలిన నీ హృదయమయిన
వదలకుండా చేర్చుకోనును
విరిగిన నీ మనసునయిన
విడువకుండా అదుకోనును ॥ 2 ॥
నీదు పాపం కొండ అయిన
నిండుగా క్షమియించు వాడు
నీదు గిన్నె పొంగులాగ
అవసరాలు తిర్చుతాడు ॥ 2 ॥ ॥ యేసు రాక ॥
కాయు కాలము కాదు అంటూ
మోడుగను నివు ఉండబోకు
ఆకలి గొన్న ప్రభు యేసు
శాపములను పొందబోకు ॥ 2 ॥
తైలము లెని దిపము తోని
పెళ్ళి మెళమును చేరుకోకు
కాలమంతయు ఖర్చు చేసి
అన్యుల గుంపులో కలిసిపోకు ॥ 2 ॥ ॥ యేసు రాక ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి