తార వెలిసెను ఈ వేళ
యేసు పుట్టిన శుభవేళ || 2||
వెలిగెను ఈ లోకం, మదిలో నిండెను ఆనందం
తరగని రక్షణను మనకై తెచ్చెను ఆ దైవం || 2||
రండి వార్తను చాటుదాము
ఆ రక్షణను పంచుదాము || 2 || || తార ||
పశుల పాకె పావనమాయే
మంద గొల్లలే తన వారయే || 2||
జ్ఞానులొచ్చిరి ఆరాధింప
రాజులలో భీతిని నింప || 2 || || తార ||
పాపమెరుగని నీతి పరుడు
లోకమును కాచే రక్షకుడు || 2 ||
కన్య మరియా గర్భమున
పుట్టెను దేవుని అంశమున || 2 || || తార ||
రాజులకు రాజయిన తనకు
ఇచ్చుటకు ఏమున్నది మనకు || 2 ||
వెండి బంగారముల కన్నా
హృదములనర్పిస్తే మిన్నా || 2 || || తార ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి